డికాషన్ బిస్కెట్..,

డికాషన్ బిస్కెట్...,
(బ్లాగ్ టైటిల్  కి బ్లాగ్ లో ఉండే కంటెంట్ కి ఏ మాత్రం సంబంధం వుండదు. ఇందులో వుండేదంతా నా సోది.,ఏదో ఒక పేరు 'తేడా'గా పెట్టాలి కాబట్టి పెట్టానా పేరు)
చాయ్ గొడవలో పడి జనాలు డికాషన్ ని మర్చిపోయారు. ఒక్క డికాక్షన్ నే కాదు.,చిన్న నాటివెన్నో మర్చిపోయాం మనం.పిప్పరమెంట్,ఆశ చాక్లెట్లు,తాటి అట్లు,టేగలు,ముంజి కాయలు,మట్టిలో దొరికే చిన్న టెంకాయలోని తెల్ల గుజ్జు,చీమ చింతకాయ,, జీడి మావిడి,ఈత కాయలు,అబ్బో .,ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.,పట్నంలో ఉంటూ వీటిని తినాలనుకోవటం అత్యాశే అవుతుంది. టౌన్ వాసనకి కూడా దూరంగా వుండే కొన్ని పల్లెటూళ్లలోనే దొరుకుతాయవి.అయితే, మన ఇంట్లోనే ఎప్పుడూ దొరికేది "డికాషన్". ఈ సారి చాయ్ లో చెక్కరకి బదులు పాలు కలపటం మానేయండి.డికాషన్ అయిపోవుతుంది.అలాగే గంజి కూడా.,అన్నం దింపే ముందు కాస్త గంజిని పక్కకు తీసి.,అందులో లైట్ గా ఉప్పు కలుపుకొని తింటే ఆ టేస్టే వేరు. ఒక సారి ట్రై చేయండి.అలాగే ఇంకో మాట., డికాషన్ బిస్కెట్ అని పెట్టాను కదా అని డికాషన్ లో బిస్కెట్లు ముంచుకు తినేరు. "చాయ్ బిస్కెట్" కి పేరడీ ఇది.
                                                            -కురచం ☺

Comments

Popular Posts